హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా SRH, DC మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, మ్యాచ్ సమయానికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా, ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉండటంతో ఈ పిచ్‌పై పేసర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది.