హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. దీంతో ఒకే వేదికపై ఐదు వరుస సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కేన్ చరిత్ర సృష్టించాడు. హ్యామిల్టన్‌లో కేన్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1563 పరుగులు చేశాడు. కాగా, కేన్‌కు టెస్ట్‌ల్లో ఇది 33వ సెంచరీ.