IPL అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు అయ్యర్ మొత్తం 93 IPL మ్యాచ్లకు కెప్టెన్సీ చేయగా.. 55 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. కేవలం 35 మ్యాచ్ల్లో మాత్రమే ఓడాడు. దీంతో 59.13 శాతం విన్నింగ్ రేట్ క్రియేట్ చేశాడు. IPL చరిత్రలో సుదీర్ఘకాలం కెప్టెన్లుగా ఉన్న రోహిత్, ధోనీల రికార్డులకు ఇది గట్టి పోటీనిస్తోంది.