అంతర్జాతీయ క్రికెట్కు పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి వీడ్కోలు పలికాడు. ఆమిర్.. 2020 డిసెంబర్లో తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, 2024లో రిటైర్మెంట్పై వెనక్కి తగ్గి టీ20 ప్రపంచకప్లో పాక్ తరపున నాలుగు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వెల్లడించాడు.