IPL 2026కు ముందు ధోనీపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ 8, 9 స్థానాల్లో బ్యాటింగ్కు దిగితే ప్రయోజనం లేదని చెప్పాడు. కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలని తెలిపాడు. కనీసం ఆరో స్థానంలోనైనా బ్యాటింగ్కు రావాలని సూచించాడు. తానైతే ధోనీ 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.