ఆషాఢమాసం (Ashadham) మొదలయ్యే నాటికి వర్షాలు కురుస్తాయి. కాస్త ఆలస్యమైనా జిల్లాలో వర్షాలు (rains) ప్రారంభమయ్యాయి. ఈ తొలకరిలో కొత్త నీరు వస్తుంది. మారుతున్న ఇలాంటి వాతావరణం(weather)లో అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఆషాఢం సందేశం.నూతన జంటలలో అమ్మాయి ఈ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదన్న సంప్రదాయం బాగా ప్రచారంలో ఉంది. శారీరకంగా,మానసికంగా అప్పుడప్పుడే భర్తకు దగ్గరవుతున్న కొత్త కోడళ్లు ఈ ఎడబాటు ద్వారా కలిగే ప్రేమ వారి భవిష్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటారు.ఈ మాసం నూతన జంటలను (New couples) కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని ఈ ఎడబాటు మరింతగా బలపరుస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి. కానీ ఈ ఆధునిక కాలపు జంటకు నెలరోజులపాటు విరహం, బాధ ఉండదు. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ, ఆకర్షణ ఉంటాయి. అలాంటి సమయంలో నెల రోజుల పాటు దూరం ఉంటే.. ఎడబాటు వల్ల కలిగే బాధేంటో వారికి అర్థమవుతుంది. దీంతో వాళ్లు జీవితాంతం అన్యోన్యంగా ఉంటారని అలా చేస్తారు.
పెళ్లి నెలరోజులకే ఉద్యోగం (job) చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తుండడంతో అత్తాకోడలు ఒకే ఇంటిలో ఉండే నిబంధన వారికి వర్తించదు. దీంతో విరహంలోని తియ్యదనాన్ని నేటితరం జంటలు ఆస్వాదించే అవకాశం లేదు. నెలరోజుల తర్వాత అంటే శ్రావణమాసం (Sravanamasam) లో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మంగళ ప్రదంగా తమ ఇంటికి తీసుకు వస్తారు.ఇక్కడితో ఆషాఢ మాసపు ఎడబాటు ముగుస్తుంది. ఆషాఢమాసమంతా హిందువులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. వివాహాలు తదితర శుభాకార్యాలు ఉండవు గనుక బంగారం కొనరు. నెలరోజుల తర్వాత శ్రావణమాసం రాగానే ఈ విరామానికి తెరపడుతుంది. ఆ తర్వాత రానున్న పండుగలు, వ్రతాలకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ సిద్ధమవుతారు.వైశాఖ, జేష్ట మాసాలు శుభ కార్యాలతో కళకళలాడతాయి. ఈనెల 19 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. తెలుగు సంవత్సరంలో నాల్గవ నెల ఆషాఢమాసం. ఈ నెలలో పౌర్ణమిరోజు చంద్రుడు నక్షత్రాలకు దగ్గరగా వస్తాడు. సంక్రాంతి (Sankranti) నుంచి ప్రారంభమైన ఉత్తరాయణాన్ని శుభకార్యాలు, పండుగలకు నెలవుగా పేర్కొంటారు.
అందుకే ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి (First Ekadashi) పర్వదినంగా, పౌర్ణమిని గురుపౌర్ణమిగా నిర్వహించుకుంటారు. ఆషాఢంలో ఆధ్యాత్మిక వేత్తలు చాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు. అనంతరం వచ్చే శ్రావణమాసంలో పండుగలు, వ్రతాలు ఉంటాయి. ఈ మాసంలోనే వర్షాలు ప్రారంభమై సూక్ష్మజీవులు పుడతాయని, కొత్త రోగాలను కలగజేసే ప్రమాదముందంటారు.ఇంటిలో వున్న ఇత్తడి దీప స్తంభాలు, కుందెలు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్యపలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీపస్తంభాలు ఆ పలకం మీద వుంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. లడూలు, మోరుండలు నైవేద్యం పెడతారు. బ్రాహ్మడికి, ముత్తైదువుకి పెట్టుకుంటారు. సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు.