Air Hostess: గాఢ నిద్రలో యువతి.. పనోడు ఏం చేశాడంటే..?
ఎయిర్ హోస్టెస్ రూపాలి అగ్రెను పనివాడు అత్వాల్ దారుణ హత్య చేశాడు. లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించింది. ఇక లాభం లేదనుకొని హత్య చేశాడు.
Air Hostess Murder: ఎయిర్ హోస్టెస్ రూపాల్ అగ్రెపై క్లీనింగ్ పని చేసే అత్వాల్ కన్ను పడింది. యువతి కనిపిస్తే చాలు.. గుడ్ మార్నింగ్, డ్రెస్ బాగుంది అంటూ మాట్లాడేవాడు. మొదట్లో లైట్ తీసుకుంది. అలా చేయడమే ఆమె తప్పయిపోయింది. దానిని అలుసుగా తీసుకొని రెచ్చిపోయాడు. ప్లాట్ ఖాళీ చేసి వెళ్లాలని అనుకుంది. ఆమె సోదరి చెప్పడంతో ఉండిపోయింది. అలా వెళ్లినా బాగుండేదెమో… ఇప్పుడు విగతజీవిగా మారింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.
రాయ్ పూర్ టు ముంబై
రూపాల్ అగ్రే.. ఎయిర్ హోస్టెస్, స్వస్థలం రాయ్‌పూర్. ఇండిగోలో జాబ్ రావడంతో ముంబై మహానగరానికి వచ్చింది. ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఎన్జీ కాంప్లెక్స్‌లో సోదరి ఉండటంతో అక్కడకు వచ్చింది. ఆ సొసైటీలో 5 అపార్ట్ మెంట్స్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ.. సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుంది. ఆ ప్లాట్స్‌లో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించేందుకు 42 మంది పనివాళ్లు ఉన్నారు. వారిలో ఒకడు అత్వాల్.. 12 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. అతనికి పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బుద్ది మాత్రం గడ్డి తింది. రూపాల్ కనిపించగానే కామంతో రెచ్చిపోయాడు. ఎప్పుడూ లొంగదీసుకుందమా అని ఎదురుచూసేవాడు. అందుకోసమే ఆమెతో మాట కలిపేవాడు. ఆ మాటలు ఇండైరెక్ట్ పంచ్‌లు పడటంతో తగ్గించింది. అయినప్పటికీ రూపాల్‌ను నీడలా వెంటాడాడు.
వెకిలి మాటలు
ఓ సారి బట్టలు ఎంత చిన్నగా ఉంటే అంతా ఎంజాయ్ చేయొచ్చని అత్వాల్ అనేశాడు. దీంతో రూపాల్ షాక్ తింది. వెంటనే సొసైటీ కార్యదర్శికి కంప్లైంట్ చేసింది. అతని ముందే అత్వాల్‌ను తిట్టి పారేసింది. అతను కూడా అరిచాడు. అత్వాల్ చాన్నాళ్ల నుంచి ఉండటం.. రూపాల్ సమస్య చెప్పినప్పటికీ కార్యదర్శి ఏం చేయలేకపోయారు. అతని బాధ భరించలేక చివరికీ ప్లాట్ నుంచి వెళ్లిపోదాం అనుకుంది. ఆమె సోదరి ఆపింది. మళ్లీ వెంటపడితే పోలీసులకు కంప్లైంట్ చేద్దామని చెప్పింది. అయినప్పటికీ అత్వాల్ తీరు మారలేదు. నల్ల లీకులు ఉన్నాయా..? వాటర్ ఏమైనా కారుతుందా..? అని అడిగేవాడు. రూపాల్ ఒంటరిగా ఎప్పుడూ దొరుకుతుందా అని చూశాడు. అతను వేచి చూసిన రోజు రానే వచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీన రూపాల్ సోదరి బాయ్ ఫ్రెండ్‌తో కలిసి టూర్ వెళ్లింది. వాళ్లు వెళ్లే సమయంలో రూపాల్ వచ్చింది. బై చెప్పి ఇంట్లోకి వెళ్లింది. ఒకరోజు డ్యూటీ చేయడంతో అలసిపోయి.. పడుకుంది.
ఆ రోజు కోసం చూసి
రూపాల్ సోదరి వెళ్లడం చూసిన అత్వాల్.. ఎలాగైనా సరే ఈ రోజు పని కానిచ్చేద్దాం అనుకున్నాడు. ప్లాట్ వెనకాల నుంచి వచ్చాడు. 4 అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లోకి.. పైప్ పట్టుకొని వచ్చి.. స్లైడింగ్ మిర్రర్ నుంచి సరాసరి ఇంట్లోకి వచ్చేశాడు. ఆ సమయంలో కాస్త చప్పుడు వినిపించి ఉంటుంది.. రూపాల్ గాఢ నిద్రలో ఉంది. బెడ్ రూమ్‌లోకి వచ్చేశాడు. రూపాల్ మీద కూర్చొగా.. ఆమె లేచింది. కేకలు పెట్టింది, పోరాడింది. కత్తి తీసి బెదిరించినప్పటికీ లొంగిపోలేదు. పెనుగులాటలో ఇద్దరూ అలసిపోయారు. రూపాల్ తనకు లొంగదని భావించాడు. హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గొంతు కోసేశాడు. ఆమె గొంతు నుంచి కారుతోన్న రక్తాన్ని పట్టుకొని హాల్లోకి వచ్చింది. అక్కడే పడిపోయింది. అతని బట్టలపై రక్తం మరకలు ఉండటంతో.. ఆ రెండింటినీ ఉతికాడు. ర్యాక్‌లో రూపాల్ సోదరి బాయ్ ఫ్రెండ్ డ్రెస్ వేసుకున్నాడు. ఉతికిన బట్టలను ఓ కవర్లో వేసుకొని.. ఎలా వచ్చాడో.. అలానే దిగిపోయాడు. ఇంటికెళ్లి.. కవర్ అక్కడ పెట్టేసి, వైద్యుడి వద్దకు వెళ్లాడు. చేతికి అయిన గాయాలకు చికిత్స తీసుకున్నాడు. తనకు ఏమీ తేలినట్టు నటించాడు.
ఫోన్ ఎత్తలేదు.. మేసెజ్ రిప్లే లేదు
టూర్ వచ్చిన రూపాల్ సోదరి ఆమెకు ఫోన్ చేసింది. అప్పటికే చనిపోయిన రూపాల్.. నిర్జీవంగా పడి ఉంది. వాట్సాప్‌లో మేసెజ్ చేసిన నో రిప్లై.. ఇదే విషయం రూపాల్ పేరంట్స్కు చెప్పింది. ఎవరినైనా పంపించమని కోరగా.. ఆఫీసులో ఉన్న స్నేహితుడిని పంపించింది. ప్లాట్ వద్దకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టి కొట్టీ, ఫోన్ చేశాడు. రూపాలి సోదరి సూచన మేరకు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వారు వచ్చిన కాలింగ్ బెల్ కొట్టిన నో యూజ్.. చివరికీ డుప్లికేట్ కీ ద్వారా డోర్ తీశారు. తీసి తీయగానే హాల్లో రక్తపు మడుగులో రూపాల్ పడి ఉంది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. బెడ్ రూమ్ పరిశీలిస్తే.. పెనుగులాట జరిగినట్టు కనిపించింది. ప్లాట్లలో పనిచేసే 42 మంది పనివారిని విచారించారు. 5 ప్లాట్లలో 200 సీసీ కెమెరాలు పరిశీలించిన ఏమీ కనిపించలేదు. వెనక అపార్ట్ మెంట్ సీసీ కెమెరా చూస్తే హంతకుడికి సంబంధించి లీడ్ దొరికింది. ఒకతను వెళ్లేప్పుడు ఓ డ్రెస్. .వచ్చేప్పుడు మరో డ్రెస్ వేసుకున్నాడు. చేతిలో కవర్ ఉంది.. ఎవరని అడగగా అత్వాల్ అని సొసైటీ కార్యదర్శి తెలిపారు. అతని చేతికి ఉన్న గాయాలు.. హత్య గురించి పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం చెప్పేవాడు.
పీఎస్‌లో సూసైడ్
అత్వాల్‌ను అందేరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 2 గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దీంతో అందరూ వెళ్లారు.. ఇద్దరూ కానిస్టేబుల్స్ అత్వాల్ మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ కానిస్టేబుల్స్ కూడా ఏం చక్క నిద్రపోయారు. ఉదయం 6 గంటలకు స్టేషన్ వచ్చేసరికి సెల్లో ఉరేసుకొని కనిపించాడు అత్వాల్. అతనికి ఇచ్చిన దుప్పటితో ఆత్మహత్య చేసుకున్నాడు. రూపాల్ చనిపోయిన 24 గంటల్లోపే ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, పిల్లలు, బంధువులకు మొహం చూపించలేక సూసైడ్ చేసుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. నిజమే.. అఘాయిత్యం చేసేందుకు వెళ్లే సమయంలో.. రూపాల్‌ను చంపే సమయంలో వాటి గురించి ఆలోచిస్తే బాగుండేది. చేసిన నేరం బయటపడ్డ తర్వాత అతను ఆత్మన్యూనత భావానికి గురై ఉంటాడు. ఇదే ఆలోచన అప్పుడే చేసి ఉంటే బాగుండేదని సైకాలజిస్టులు అభిప్రాయ పడుతున్నారు.