• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. అందుకేనా ఈ పర్యటన?

అంతా భావిస్తున్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమ, మంగళవారాల్లో జగన్ దిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6.45 గంటలకు దిల్లీ చేరుకుంటారు. వన్‌ జన్‌పథ్‌ నివాసంలో రాత్రికి బస చేస్తారు. ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ స...

January 30, 2023 / 08:07 AM IST

మహిళల తాళిబొట్టు తాకట్టు పెట్టారు.. జగన్‌పై లోకేశ్ ఫైర్

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో జగన్ సర్కార్ చర్యలను ఎండగట్టారు. జగన్​ను నమ్మి అధికారం అప్పగిస్తే.. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. మద్యపాన నిషేధం హామీతో అధికారం చేపట్టి, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి చేపట్టిన తర్వాత అధిక ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కుప్...

January 29, 2023 / 09:05 PM IST

వివేకా బాత్రూంలో రక్తం కడిగిందెవరు?: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి

సీబీఐ విచారణకు వెళ్లే ముందు వైఎస్ విజయమ్మను అవినాశ్ రెడ్డి కలవడం వెనుక ఆంతర్యమేమిటని టీడీపీ శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 5 రోజుల గడువు దేనికి అని నిలదీశారు. చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా ముత్యం అని అనివాశ్ రెడ్డిని ఎద్దేవా చేశారు. హత్య కేసు విషయంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్న అవినాశ్ అసలు వివేకానందరెడ్డి హత్య జరి...

January 29, 2023 / 08:50 PM IST

ఒడిశా మంత్రి నబా దాస్ మృతి..బుల్లెట్ గాయాలతో రక్తస్రావం

ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌ తుదిశ్వాస విడిచారు. ఎఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరపడంతో తీవ్ర రక్తస్రావమైంది. తొలుత బ్రజ్ రాజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి భువనేశ్వర్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దగ్గర నుంచి ఛాతీపై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. మరో ముగ్గురు కూడా గాయపడ్డారట. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు ...

January 29, 2023 / 08:19 PM IST

ASIకు పిచ్చి.. 8 ఏళ్లుగా ట్రీట్‌మెంట్: భార్య జయంతి దాస్

ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై కాల్పులు జరిపిన ఎఎస్ఐ గోపాల్ దాస్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారట. అతని భార్య ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపింది. గత కొన్నేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని, మందులు కూడా వాడుతున్నారని పేర్కొంది. ‘ఏం జరిగిందో నాకు తెలియదు. వార్తల్లో చూసి తెలుసుకున్నా. ఘటనా జరిగిన సమయంలో నేను ఇంట్లో ఉన్నాను. ఈ రోజు ఉదయం నుంచి తాను భర్తతో మాట్లాడలేదని తెలిపింది. ఉదయం తన కూతురు వీడియో కా...

January 29, 2023 / 07:55 PM IST

సీఎం అభ్యర్థి ఎవరు? లోకేశ్‌కు మంత్రి విడదల రజని ప్రశ్న

నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఏ విష‌యంలో క్లారిటీ లేకుండా పాద‌యాత్ర చేస్తున్న వ్య‌క్తిగా చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని తెలిపారు. పల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో గ‌డ‌పగ‌డ‌పకు కార్య‌క్ర‌మంలో మంత్రి రజని పాల్గొన్నారు. పాద‌యాత్ర ఎందుకో.. ఆ యాత్ర లక్ష్యం ఏమిటో ఆయ‌నకే తెలియ‌న‌ట్టు...

January 29, 2023 / 07:31 PM IST

తాజ్ మహల్‌ను తలపిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ (వీడియో)

తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. కొత్త సచివాలయ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పొగమంచులో సచివాలయ వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. మంచులో సచివాలయం తాజ్ మహల్‌ను తలపిస్తోంది. దీంతో పలువురు లైక్, చేసి కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. సచివాలయం, తాజ్ మహల్‌ను పోలి ఉందని రాస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా.. ఇదీ సచివాలయమేనా.. లేదంటే ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ అనే స...

January 29, 2023 / 06:32 PM IST

ముందస్తుకు రె‘ఢీ’: కేసీఆర్‌తో చెప్పించు..కేటీఆర్‌కు బండి సవాల్

ముందస్తు ఎన్నికలకు వెళదాం అంటూ మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాళ్లు విసరుకున్నారు. నిజామాబాద్ పర్యటనలో నిన్న మంత్రి కేటీఆర్ కామెంట్ చేయగా, ఈ రోజు బండి సంజయ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని బండి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ తన తండ్రితో చెప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో కోవర్డులు ఉండర...

January 29, 2023 / 07:32 PM IST

లాల్ చౌక్ వద్ద జెండా ఎగురవేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చివరి మజిలీగా శ్రీనగర్‌లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు రాహుల్. సోనావార్‌లో 30 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారని, అక్కడ నుంచి ఘంటా ఘర్...

January 29, 2023 / 05:53 PM IST

12 సిమ్స్ ఉన్నాయ్..టెలిగ్రామ్ కాల్ రికార్డ్ చేయలేరు: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. 3 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తనకు మరో ఫోన్ ఉందన్నారు. 12 సిమ్ కార్డులు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ను పెగాసస్ రికార్డు చేయలేదని స్పష్టంచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్...

January 29, 2023 / 03:53 PM IST

విలీనమా.. పొత్తా? కేసీఆర్ తో తమిళ నటుడి డీల్ ఏమిటీ?

భారత రాష్ట్ర సమితిగా పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. తెలంగాణను వదిలి ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సభలు నిర్వహించక ముందే కేసీఆర్ కు ఉత్సాహం నింపేలా హైదరాబాద్ కే ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి చేరుతున్నారు. ఒడిశా నాయకుల చేరికతో కేసీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశాలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేశారు. ఈలోపే ...

January 29, 2023 / 03:16 PM IST

అదానీ ఎఫెక్ట్, రెండ్రోజుల్లో 10 లక్షల కోట్లు ఫట్

భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయాడు. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ. 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. న్యూయార్క్ కేంద్రంగా ప...

January 29, 2023 / 12:57 PM IST

ముందస్తు ఎన్నికలు ఖాయమా? తెలంగాణలో కాక రేపుతున్న రాజకీయ వేడి

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది.కేసీఆర్ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా…లేక రైట్ టైమ్ కే వస్తారా అన్న అంశంపై రచ్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తే లేటేస్టుగా కేటీఆర్ పుల్ క్లారిటీ ఇచ్చారు.పైగా బాల్ బీజేపీ కోర్టులో వదిలారు. ముందుస్తుపై బీఆర్ఎస్ ‌-బీజేపీ మద్య సవాళ్లలో కాంగ్రెస్ కూడా సై అంటోందా? తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుం...

January 29, 2023 / 11:39 AM IST

నేటితో ముగియనున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్...

January 29, 2023 / 10:43 AM IST

ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్‌ నాందేడ్‌ పర్యటన

భారత రాష్ట్ర సమితి దేశమంతా శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీ, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు బీఆర్‌ఎస్‌ ఉత్తర తెలంగాణ నేతలు కసరత్తు చేస్తు...

January 29, 2023 / 10:27 AM IST