• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం..అత్యవసరంగా విమానం ల్యాండ్

ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో తిరిగి విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వల్ల సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. సీఎం జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం...

January 30, 2023 / 06:14 PM IST

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కు ఇదే చివరి బడ్జెట్ కావడం విశేషం. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో సాగనున్నాయి. తొలి విడత జనవరి 31వ తేది నుంచి ఫిబ్రవరి 13వ తేది వరకూ సాగనున్నాయి. ఆ తర్వాత రెండో విడత మార్చి 13వ తేది నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేది [&he...

January 30, 2023 / 03:53 PM IST

ప్ర‌జ‌ల స‌హ‌కారం చూసి కన్నీళ్లు ఆగలేదు : రాహుల్ గాంధీ

భారత జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. భార‌త్ జోడో యాత్ర ముగిసిన నేప‌థ్యంలో శ్రీన‌గ‌ర్ లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. మంచు వానను సైతం లెక్క‌చేయ‌కుండా ఆయ‌న ప్ర‌సంగించారు. త‌న పాద‌యాత్రకు స‌హ‌క‌రించిన వారికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని అన్నారు.జోడో యాత్ర‌తో ప్ర‌జ‌ల స‌హ‌కారం చూసి త‌న‌ క‌ళ్ల వెంట నీరు కారిందని రాహుల్ అన్నా...

January 30, 2023 / 02:35 PM IST

డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో: సీఎం జగన్ కొత్త భాష్యం

ప్రతిపక్షాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శల దాడి పెంచాడు. తన పాలన వైఫల్యాలపై మూకుమ్మడిగా దాడి చేస్తుండడంతో జగన్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పొత్తులు లేవని.. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని.. తాను సింహంలా ఒక్కడినే వస్తానని చెప్పారు. తనకు భయం లేదని.. ప్రజలను, దేవుడిని నమ్ముకున్నట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహిం...

January 30, 2023 / 01:39 PM IST

ఈటల కోవర్టు కామెంట్స్ పై రాములమ్మ కౌంటర్

తెలంగాణ బీజేపీలో కోవర్టు కామెంట్స్ కలకలం రేపాయి. అన్నీ పార్టీలో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. వెంటనే రాములమ్మ విజయశాంతి స్పందించారు. ఎవరో ఆ కోవర్టులు బయటపెట్టాలని కోరారు. ఈ ఇద్దరు నేతల మధ్య పడటం లేదని తెలుస్తోంది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే? ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ ఇవ్వాలని హైకమాండ్ అనుకుంద...

January 31, 2023 / 02:46 PM IST

ఉత్తరాంధ్రుల కోసం కేసీఆర్ తోనైనా మాట్లాడుతా: ఏపీ స్పీకర్

ఉత్తరాంధ్రుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర కులాలను బీసీలుగా గుర్తించేందుకు అవసరమైతే సీఎం కేసీఆర్ ను కోరుతానని ప్రకటించారు. కళింగ సామాజిక వర్గం మొత్తం తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో సోమవారం నిర్వహించిన కళింగ ఆత్మీయ వేదికకు స్పీకర్ తమ్మినేని...

January 30, 2023 / 12:59 PM IST

పెద్దిరెడ్డి లాక్కున్న వడ్డెర క్వారీలను తిరిగి ఇప్పిస్తాం : లోకేష్

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు ప్రజలు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. కుప్పం నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ యాత్రకి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గాంధారమాకుల పల్లెలో వడ్డెర సంఘం ప్రతినిధుల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఇచ్చే రూ.10పై జగన్ బొమ్మ ఉంటుందని, తీసుకునే రూ.100 ఉండదని చెప్పారు. జనం నుంచి రూ. 100 లాక్కునే కరెంట్ బిల్లు, ఆర్టీసీ టికెట్, చెత్త పన్ను, ఇంటి ...

January 30, 2023 / 02:53 PM IST

తారకరత్నకు ఎంఆర్ఐ స్కాన్.. శరీరం చికిత్సకు స్పందిస్తోంది

నందమూరి తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని బెంగళూర్ నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. ఈ రోజు ఎంఆర్ఐ స్కాన్ తీస్తామని తెలిపారు. స్కాన్ రిపోర్ట్ ఆధారంగా చికిత్స అందజేస్తామని చెబుతున్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనకు కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో బెంగళూర్ నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ...

January 30, 2023 / 11:48 AM IST

మేం సత్యవంతులం కాదు.. నోరు జారిన మరో వైసీపీ ఎమ్మెల్యే

అవినీతి అనేది కొత్తేమీ కాదని.. తామేమి సత్యవంతులం కాదని ఓ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నోరు జారాడు. గత ప్రభుత్వం అధికంగా అవినీతి జరిగింది.. మా ప్రభుత్వం కొంత జరుగుతోంది అని తెలిపాడు. ఇది మరింత తగ్గించేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంటే వైఎస్ జగన్ పాలనలో అవినీతి జరుగుతుందని పరోక్షంగా ఆ ఎమ్మెల్యే అంగీకరించినట్టు కనిపిస్తోంది. ఇలా తమ పాలన లోపాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటకు చెబ...

January 30, 2023 / 11:23 AM IST

మంగళగిరి సీఐడీ కార్యాలయానికి చింతకాయల విజయ్

ఐ-టీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ సోమవారం మంగళగిరి ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ సతీమణి భారతీ లక్ష్యంగా విజయ్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘భారతి పే’ అని పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఐ- టీడీపీ ద్వారా పోస్ట్ సర్క్యులేట్ చేశారని సీఐడీ పోలీసులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీన కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో గల విజయ్ ఇంటికెళ్లి 41 సీఆర్పీసీ [&hell...

January 30, 2023 / 11:06 AM IST

పోలీసుల రూ.800 కోట్లు సీఎం జగన్ వాడుకున్నారు: అయ్యన్న

సీఎం జగన్‌పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్నీ వర్గాలను ఇబ్బందికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఉద్యోగులను కూడా వదలడం లేదన్నారు. అన్ని డిపార్ట్‌మెంట్‌లలో ఇదే పరిస్థితి అని వివరించారు. పోలీసులు గవర్నమెంట్ వద్ద జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ పేరుతో కొంత సొమ్ము జమ చేస్తారు. దానిని పిల్లల చదువు.. లేదంటే పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకునే అవసరాలకు వాడుకుం...

January 30, 2023 / 08:57 AM IST

‘క్యూనెట్‌’ మోసం.. సానియా మీర్జా ప్రమోట్ చేయొద్దు: సజ్జనార్

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఆ సంస్థలకు ప్రముఖులు ప్రచారం చేయడంతో ప్రజలు నమ్ముతుంటారు. క్యూనెట్ సంస్థ మోసాలు అన్నీ ఇన్నీ కావు. చైన్ మార్కెటింగ్‌తో దేశంలో రూ.5 వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడింది. దీనికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం సరికాదని ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ అన్నారు. వాటిని సపోర్ట్ చేయొద్దని ఆ...

January 30, 2023 / 08:27 AM IST

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు షెడ్యూల్

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 8 గంటలకు యాత్ర ప్రారంభమై.. రాత్రి 7.20 గంటలకు ముగియనుంది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను లోకేశ్ కలిసి, సమస్యలను తెలుసుకుంటున్నారు. యాత్రకు మహిళలు బ్రహ్మారథం పడుతున్నారు. స్వాగతం పలికి, వీర తిలకం దిద్దుతున్నారు. తమ సమస్యలు లోకేశ్‌తో చెప్పుకుంటున్నారు. చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి నాలుగో రోజు (సోమవారం) ...

January 30, 2023 / 07:44 AM IST

కేంద్ర మంత్రి వర్గంలో మార్పులకు కసరత్తు.. తెలంగాణ నుంచి మరొకరికి ఛాన్స్?

కేంద్ర మంత్రి వర్గంలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. కీలక రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు..మిత్రులను మంత్రి మండలిలోకి ఆహ్వానించే ఆలోచనతో మోదీ సర్కారు కనిపిస్తోంది. పలు శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే నాలుగు శాఖల మినహా మిగతా శాఖల్లో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. కొందరు మంత్రులు, సహాయ మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని.. ఇప్పటికే వాళ్లకు పరోక్షంగా సంకేతాలిచ్చినట్టు సమాచారం. బడ్జెట్ సమా...

January 30, 2023 / 07:44 AM IST

బడ్జెట్ పై పేచీ: గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ముదిరిన వివాదం

తెలంగాణలో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వార్షిక బడ్జెట్ ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు ఇంకా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి ఇవ్వలేదు. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. బడ్జెట్ ప్రతిపాదనలు, సిఫారసులతో సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. కానీ దీనికి గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వ...

January 31, 2023 / 07:05 AM IST