నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని చిలకలూరిపేట దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు టిడిపి నాయకులు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు.తా రకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకున్నట్లు చెప్పారు. అతను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని, అలాంటి యువత రావాలన్నారు. అలాగే సినిమా పరిశ్రమలో ఆయన అవసరం ఎంతో ఉందన్నారు. హీరోగా పలు చిత్రాలు నటించి, అభిమానులను అలరించాడని చెప్పారు. కానీ ఇప్పుడు ఆరోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉన్నారని, త్వరగా కోలుకొని రావాలన్నారు.
నారా లోకేష్ యువగళం పైన కూడా స్పందించారు. పాదయాత్రపై మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని, కానీ ఈ యాత్రతో వారి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. బొత్స సత్యనారాయణజ్ మరికొందరు మంత్రులు యువ గళంపై పనిలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తరు. కానీ మీకు సంబంధించిన ఇండియా టుడే సర్వేలోనే మీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. 50 నుంచి 30 శాతానికి పడిపోయిన మీకు లోకేష్ ను విమర్శించే స్థాయి ఉందా అని నిలదీశారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
లోకేష్ ను చూసి మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా రౌడీ పాలనకు చెక్ పెట్టి ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. వైసీపీకి ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. పార్టీని ఎప్పుడు ఇంటికి పంపిద్ధామా అని ఎదురు చూస్తున్నారన్నారు.