జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా తిరగనీయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలకు తోడు, ఇప్పడుు పవన్ ఎన్నికల ప్రచారరథం వారాహి పైన వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు. వారాహి రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ తెలంగాణలో జరిగిందని తెలిసిన అనంతరం వైసీపీ వ్యాఖ్యలు చూస్తుంటే, భ...