వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. తన తమ్ముడికి నియెజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని చెప్తోందని ఆయన ఆరోపించారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను నిలబడబోనని స్పష్టం చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో తన మనసు కలత చెందిందన్నారు. కంటి నిండాకునుకు లేకుండా చేస్తోందని వాపోయారు. అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టమన్నారు. రాజకీయాలు తనకు కొత్త కాదని ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీలో అవమానాలను భరించలేనని చెప్పారు. కోటంరెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.