పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కు ఇదే చివరి బడ్జెట్ కావడం విశేషం. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో సాగనున్నాయి. తొలి విడత జనవరి 31వ తేది నుంచి ఫిబ్రవరి 13వ తేది వరకూ సాగనున్నాయి. ఆ తర్వాత రెండో విడత మార్చి 13వ తేది నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేది వరకూ సాగనున్నాయి.
ఫిబ్రవరి 1వ తేదిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెడతాను. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా నేడు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే నిర్ణయాలు, ప్రజలపై భారాలు తొలగించే నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే అవకాశం ఉంది.