నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. జగన్ పాలనలో సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టీడీపీ గెలిచిన తరువాత వచ్చిందని నారా లోకేశ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా తమ పార్టీయేనని చెప్పారు. ...
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణం అవనుందని సీఎం జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అప్పుడే ఎలా మాట్లాడతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీంకోర్టుని కూడా సీఎం జగన్ గౌరవించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదీ జగన్ నిరంకుశ వైఖరికి నిదర్శనం ...
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోమవారం ఉదయం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇందుకు సంబంధించిన వ్యక్తిని గుర్తించారు. మనస్థిమితం లేని 38 ఏళ్ల వ్యక్తి ఈ ఫోన్ చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు. అతను అప్పటికే ఢిల్లీలోని గులాబీ బాగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార...
వైసీపీ అధినేత, సీఎం జగన్ లక్ష్యంగా రెబల్ లీడర్లు కామెంట్స్ చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ జాబితాలో ఆనం రాం నారాయణ రెడ్డి కూడా చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆనం రాం నారాయణ రెడ్డి జాయిన్ అయ్యారు. గత ఏడాదిన్నర నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వీలులేకుండా...
ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. వివిధ అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయన ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. వైయస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచిందని గుర్తు చేశారు కేశవ్. ఇలాంటి సమయంలో అందరి దృష్టిని మళ్లించడానికి జగన్ హఠాత్తుగా విశాఖ రాజధాని పాట పాడుతున్నారన్నారు. వివేకా హత్య జరిగిన రోజున కడప ఎంపీ అవినాష్ ర...
నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను ఆమె ప్రవేశపెట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన అనంతరం నిర్మలమ్మ ఈ సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేసారు. కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు రోజు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంటు ఉభయసభల ఎదుట ప్రవేశపెట్టడం ఆనవాయితీ....
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా బహిష్కరించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించినట్లు ఆ పార్టీలు తెలిపాయి. అంతే కానీ రాష్ట్రపతికి వ్యతిరేకంగా తాము లేని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవ రావు స్పష్టతనిచ్చారు. ఈ ...
రాజధాని విషయమై ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. విశాఖపట్టణం రాజధాని కాబోతుందని.. కొన్ని నెలల్లో తాను కూడా అక్కడే మకాం మార్చనున్నట్లు ప్రకటించాడు. సుప్రీంకోర్టులో రాజధాని మార్పుపై విచారణ జరుగుతున్న సమయంలోనే జగన్ ప్రకటన చేయడం విశేషం. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో అలజడి రేగింది. అమరావతి రాజధానిగా కొనసాగాలని ఉద్యమం కొనసాగ...
తనను తెలంగాణ నుంచి తరిమేస్తారా.. తరిమేయండి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అని తెలిపారు. తాను మాత్రం ధర్మ మార్గం విడవని ప్రకటించారు. విద్వేష ప్రసంగాలతో మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారంటూ తెలంగాణ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మంగళవారం స్పందించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. తన జీవితం ధర్మం కోసమేనని ప్రకటించారు. ఎక్కడో ముంబైలో మాట్లాడితే ఇక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్న...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మోడీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం మన రాజ్యాంగానికి, ప్రత్యేకించి మహిళల గౌరవానికి గర్వకారణమన్నారు. ఐఎంఎఫ్ ఆర్థిక అంచనాల గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రజా సమస్యలను తగ్గించి సరైన పాలన అందించే దిశగా బడ్జెట్ ...
ఏపీలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై సొంత పార్టీ నాయకులే తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఈ ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా అలుముకుంది. పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు ఇది బహిర్గతమవుతోంది. అందుకే తరచూ మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్య...
ఏపీలో మూడు రాజధానుల అంశం పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. మరోవైపు రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలయింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికి ఇబ్బంది పడాల్సి వస్తోందని తన శాఖపరమైన విషయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నట్లు ఆర్డర్ చేసుకోవాల్సి వస్తోందని వాపోయారు. చివరకు పెన్ను కొనాలన్నా ఆర్డర్ ఇచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్య...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక తీగా దొరికినట్లుగా తెలుస్తుంది. అది తాడేపల్లికి కనెక్ట్ అయినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. వీటి ఆధారంగా కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున...
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానాలలో పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా మాత్రం తేవడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకు వస్తానని పదేపదే చెప్పారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా హోదా మాట లేదని మండిపడ్డా...