రాజధాని విషయమై ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. విశాఖపట్టణం రాజధాని కాబోతుందని.. కొన్ని నెలల్లో తాను కూడా అక్కడే మకాం మార్చనున్నట్లు ప్రకటించాడు. సుప్రీంకోర్టులో రాజధాని మార్పుపై విచారణ జరుగుతున్న సమయంలోనే జగన్ ప్రకటన చేయడం విశేషం. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో అలజడి రేగింది. అమరావతి రాజధానిగా కొనసాగాలని ఉద్యమం కొనసాగుతున్నా మూడు రాజధానులపై సీఎం పట్టుబట్టడంతో ప్రస్తుతం ఏపీలో రాజధాని గొడవ నడుస్తోంది.
ఢిల్లీలో ఏపీ గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన సీఎం జగన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ‘మార్చి 3, 4వ తేదీల్లో విశాఖపట్టణంలో గ్లోబల్ సమ్మిట్ జరుగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నా. విశాఖ రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి తరలి వెళ్తున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా’ అని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ధన్యవాదాలు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ చెప్పి ప్రసంగం ముగించారు.
I am inviting all of you to Visakhapatnam,which is going to be capital in a days to come.. CM Ys Jagan At diplomats outreach prog to invite them for global investors summit#APGIS2023#YSJaganpic.twitter.com/RYQOhGKFtV
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) January 31, 2023