MHBD: జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సెషన్స్ జడ్జి మొహమ్మద్ అబ్దుల్ రఫీని జిల్లా నూతన ఎస్పీ డాక్టర్ శబరీష్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి పూలమొక్క అందజేసి, సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు, పెండింగ్ కేసులు, తదితర విషయాల గురించి వారిరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జడ్జి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.