• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

వైఎస్సార్ సీపీకి మరో షాక్.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీటలు బారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో పార్టీని భారీ కుదుపులు ఆందోళన కలిగిస్తుండగా మరో చోట పార్టీ కార్యకర్తలే కోపమొచ్చింది.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆలయంలోకి అడుగు పెట్టకూడదని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. చదవండ...

February 2, 2023 / 09:42 AM IST

తెలంగాణకు రాలేను లే.. మోదీ టూర్ మళ్లీ వాయిదా?

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మరోసారి వాయిదా పడ్డట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండడంతో ఫిబ్రవరి 13న తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వాస్తవంగా సంక్రాంతికి తెలంగాణలో మోదీ పర్యటించాల్సి ఉంది. వందే భారత్ రైలు ప్రారంభం, సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మరికొన్ని కార్యక్రమాల కోసం ప్రధాని హైదరాబాద్ కు రావాల్సి ఉంది. అధికారికంగా షెడ్యూల్...

February 2, 2023 / 09:13 AM IST

సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, పవన్‌కు రాసిస్తా: అమర్నాథ్

త్వరలో విశాఖపట్నం భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సంబంధించి ఢిల్లీలో జరిగిన సన్నాహక సదస్సు వివరాలను వెల్లడించారు. 49 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో...

February 2, 2023 / 08:48 AM IST

తెలంగాణకు తీరని అన్యాయం.. 9 ఏళ్లుగా ఇదే మోదీ ధోరణి

కొత్త రాష్ట్రం తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయమే చేస్తోంది. చేదోడు ఇవ్వాల్సిన కేంద్రం చేతులు విరిచేలా ప్రవర్తిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కిన ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఒక్క చోట కూడా తెలంగాణ అనే పదం బడ్జెట్ ప్రసంగంలో వినిపించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది. అలాంటి రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంద...

February 2, 2023 / 07:55 AM IST

కేసీఆర్ కు బూస్ట్.. మరో రాష్ట్రంలోకి బీఆర్ఎస్ పార్టీ

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఆదరణ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులు వచ్చి కేసీఆర్ తో సమావేశమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి వస్తామని ప్రకటించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖులు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు బీఆర్ఎస్ ల...

February 2, 2023 / 07:23 AM IST

పేదల గురించి రెండుసార్లే ప్రస్తావించారు: బడ్జెట్‌పై చిదంబరం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం రెండుసార్లు మాత్రమే పేదల ప్రస్తావన తెచ్చారన్నారు. ప్రజలు, వారి ఆందోళనలను ఏమాత్రం మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏ మాత్రం కనికరం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారన్నారు. 90 నిమిషాల ప్రసంగంలో నిరు...

February 2, 2023 / 07:21 AM IST

మూడు రాజధానులే, ఫోన్ ట్యాపింగ్ నాటకం: కొడాలి నాని

తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అని, అక్కడకు తాను షిఫ్ట్ అవుతున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మూడు రాజధానులపై స్పందిస్తున్నారు. జగన్ ఢిల్లీలో కొత్తగా ఏమీ చెప్పలేదని, ఎప్పుడూ చెప్పేదే చెప్పారన్నారు. సుప్రీం కోర్టు కూడా తమకు రాజధానిపై శాసనాధికారం లేదంటే, కేంద్రం ప్రభుత్వంతో బిల్లు...

February 1, 2023 / 08:44 PM IST

కొత్త పన్ను విధానంపై బలవంతం లేదు: నిర్మలమ్మ

వేతనజీవులు ఆకర్షణీయంగా ఉన్న కొత్త పన్ను విధానంలోకి మారవచ్చునని, అయితే ఎవరినీ ఈ పన్ను విధానంలోకి రావాలని బలవంతం చేయబోమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదాయపు పన్నులో చేసిన గణనీయమైన మార్పులు మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించడంతో ప్రస్తుతం కొత్త పన్నుల విధానం అధిక ప్రోత్స...

February 1, 2023 / 08:12 PM IST

కార్పోరేట్లకు అనుకూల బడ్జెట్: హరీష్ రావు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీనిపై హరీష్ స్పందించారు. ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి బడ్జెట్‌లో దాదాపు 30 శాతం కోత విధించారన్నారు. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నా...

February 1, 2023 / 08:00 PM IST

పవన్, లోకేష్, బాబులకే కష్టాలు: ద్వారంపూడి

పాదయాత్ర ఇప్పుడు అందరికీ ఓ ఫ్యాషన్‌గా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఉద్దేశించి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే, వారు ఆదరిస్తారు, గౌరవిస్తారని, కానీ జగన్ హయాంలో ఏపీ సంతోషంగా ఉందని చెప్పారు. ఇలాంటప్పుడు పాదయాత్ర చేస్తే ఎవరూ హర్షించరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అ...

February 1, 2023 / 07:00 PM IST

ఆదాయపు పన్ను ఊరట, మీరు ఎంత డబ్బు సేవ్ చేస్తారు?

ఆదాయపు పన్నుకు సంబంధించి 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటను ఇచ్చారు. ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. పాత పన్ను విధానంలో మార్పులేదు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను రేటు విధిస్తారు. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమ...

February 1, 2023 / 03:45 PM IST

లోకేష్ అంకుల్ అంటూ మండిపడిన రోజా

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేయడం పట్ల మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రంగా స్పందించారు. ప్రతిగా లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారో, తాము మళ్లీ వస్తే ఏం చేయనున్నారో చెప్పకుండా పాదయాత్ర అంటూ నడవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోచ...

February 1, 2023 / 03:08 PM IST

ఏపీ రాజధాని ఏదని గూగుల్‌లో వెతికినా విశాఖే చూపిస్తోంది

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విశాఖపట్టణం అని సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షాలు సీఎం జగన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. దేవినేని ఉమ అయితే వైఎస్ వివేకా కేసును సీబీఐ స్పీడప్ చేసిందని, దృష్టి మరల్చేందుకు రాజధాని అని కామెంట్ చేశారని విమర్శించారు. వైసీపీ మంత్రులు/ నేతలు జగన్ కామెంట్స్‌ను సమర్థిస్తున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీ రాజధాని ఏది అని గూగుల్...

February 1, 2023 / 02:35 PM IST

లోకేశ్‌కు గోడు వెల్లబోసుకున్న చెరకు రైతులు, కార్మికులు

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డి పల్లె మండలంలో పలువురితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సాకే గ్రామంలో చెరకు రైతు వెంకట రమణ తన బాధను చెప్పుకున్నారు. ఒకటిన్నర పొలం, బెల్లం గానుగ చూపించి ఇబ్బందులను తెలిపారు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని లోకేశ్ మండిపడ్డారు. ‘వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగ...

February 1, 2023 / 02:20 PM IST

సీఎం కేసీఆర్ పై గవర్నర్ కు షర్మిల ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాజకీయాల్లో రోజుకో పరిణామం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయాలు వేడెక్కగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరింత హీటెక్కాయి. తాజాగా ఈ గవర్నర్ వ్యవహారంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల రంగంలోకి దిగనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ లో అపాయింట్ మెంట్ కోరారని పార్టీ వర్గాలు తెలిపారు. గురువారం గవర్నర్ తమిళిసైని షర్మిల కలువనున్నారు....

February 1, 2023 / 01:56 PM IST