income tax, budget, budget 2023, nirmala sitharaman, salary, tax, ఆదాయపు పన్ను
ఆదాయపు పన్నుకు సంబంధించి 2023-24 బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటను ఇచ్చారు. ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. పాత పన్ను విధానంలో మార్పులేదు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను రేటు విధిస్తారు. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుండి రూ.52,500కు పెంచారు. అలాగే, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ సమయాన్ని 93 రోజుల నుండి 16 రోజులకు తగ్గించారు. పన్ను పరిమితి పెంపు, రిటర్న్స్ పైలింగ్ సమయం తగ్గింపు ప్రయోజనకరమని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ట్యాక్స్ రిలాక్సేషన్ మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజకరమని చెబుతున్నారు. వ్యవస్థలో డిమాండ్ పెంపుకు కారణమవుతుందని అంటున్నారు. ఇక నుండి రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కొత్త ఆదాయపు పన్ను విధానం డీఫాల్టు ఆప్షన్‌గా వస్తుంది. పాత పన్ను విధానంలో ఉన్నవారు ఎప్పటిలా అందులో పొందుతున్న రాయితీలను గతంలో వలె కొనసాగించవచ్చు. వారు కోరుకుంటే కొత్త పన్ను విధానంలోకి మారవచ్చు.
కొత్త ఆదాయపు పన్నును ఎంచుకుంటే వేతనజీవులకు కొంత మిగులుతుంది. తాజా బడ్జెట్ ప్రకారం ఓ శాలరైడ్ వేతనం ఏడాదికి రూ.9 లక్షలు అయితే, ఇదివరకు రూ.60,000 పన్నుగా చెల్లించగా, ఇప్పుడు 5 శాతం అంటే ఇక నుండి రూ.45,000 చెల్లించాలి. అంటే రూ.15,000 తగ్గుతుంది. రూ15,000 వార్షిక వేతనం ఉంటే ఇదివరకు రూ.1.87 లక్షలు చెల్లించగా, ఇప్పుడు 10 శాతం అంటే రూ.1.50 లక్షలు చెల్లించాలి.