నందమూరి తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని బెంగళూర్ నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. ఈ రోజు ఎంఆర్ఐ స్కాన్ తీస్తామని తెలిపారు. స్కాన్ రిపోర్ట్ ఆధారంగా చికిత్స అందజేస్తామని చెబుతున్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనకు కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో బెంగళూర్ నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, కుటుంబ సభ్యులు వచ్చారు. మంచు మనోజ్ నిన్న పరామర్శించారు. తన ఫ్రెండ్ కోలుకుంటున్నాడని ట్వీట్ చేశారు. తారకరత్న గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్స్ ఉన్నాయట. దీంతో ఎక్మో ద్వారా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.
తారకరత్న సినిమాల్లో సత్తా చాటలేకపోయారు. హీరోగా విజయం అందుకోలేదు. అమరావతి మూవీలో విలన్‌గా చేశారు. రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చెప్పారు. నారా లోకేశ్‌తో ఇటీవల పలుమార్లు భేటీ అయ్యారు. లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టగా దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి రోజే ఒత్తిడికి గురై.. కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో తారకరత్నకు ప్రాణాపాయం తప్పింది.