అఘోరాగా నటిస్తున్న విశ్వక్ సేన్ తాజా చిత్రం గామి. ట్రైలర్ తరువాత చాలా మంది ప్రముఖులు ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెలవరించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా రాజామౌళి సైతం స్పందించాడు.
Rajamouli's response to Vishvak Sen's film Gami.. What did he say?
Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)కి ఏదైనా సినిమా నచ్చిందంటే చాలు దాని గురించి స్పందిస్తూ.. టీమ్‌కు తన ప్రోత్సాహాన్ని అందిస్తారు. తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswak Sen) నటించిన గామి(Gaami) చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 6 సంవత్సరాలుగా చిత్రీకరణ జరుపుకుంటుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఇన్ని సంవత్సరాలు దర్శక, నిర్మాతలు ఒక సినిమాను నిర్మించడం అంటే మాములు విషయం కాదన్నారు. గామి కోసం యూనిట్ అంత ఎంత కష్టపడ్డారో మేకర్స్‌తో మాట్లాడినప్పుడు అర్థం అయిందని తెలిపారు. ఇక ట్రైలర్లో చూపించిన విజువల్స్ చాలా బాగున్నాయి అని, మొత్తం సినిమాలో ఇంతకన్నా బాగుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఫస్ట్ లెక్, టీజర్ ట్రైలర్‌తో ఆకట్టుకున్న గామి మూవీలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న గామికి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండగా కేవలం తెలుగులోనే ఎందకు అంటే దానికి విశ్వక్ సేన్ సమాధానం చెప్పారు. కాంతార సినిమా కూడా మొదట కన్నడలోనే విడుదలైంది. అక్కడ విజయం సాధించాక పాన్ ఇండియాలో విడుదలైంది. అలాగే గామి కూడా తెలుగులో విజయం సాధించాక మిగితా భాషాల్లో డబ్బింగ్ చేస్తామని తెలిపారు. శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది.