భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయాడు. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ. 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. న్యూయార్క్ కేంద్రంగా ప...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది.కేసీఆర్ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా…లేక రైట్ టైమ్ కే వస్తారా అన్న అంశంపై రచ్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తే లేటేస్టుగా కేటీఆర్ పుల్ క్లారిటీ ఇచ్చారు.పైగా బాల్ బీజేపీ కోర్టులో వదిలారు. ముందుస్తుపై బీఆర్ఎస్ -బీజేపీ మద్య సవాళ్లలో కాంగ్రెస్ కూడా సై అంటోందా? తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుం...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్...
భారత రాష్ట్ర సమితి దేశమంతా శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీ, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు బీఆర్‌ఎస్ ఉత్తర తెలంగాణ నేతలు కసరత్తు చేస్తు...
ఆంధ్ర ప్రదేశ్ లో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పష్టం చేశారు. ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం, జనసేన పొత్తుపై కూడా అంబటి స్పందించారు. ఎంతమంది కలిసి వచ్చిన 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు. మళ్లీ జగన్ ముఖ్య...
టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరో 24 గంటలు గడిచాక మరోసారి పర...
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. కాల్ డేటా మొదలు ఆర్థిక లావాదేవీల వరకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు విచారించింది. విచారణ అనంతరం మరోసారి రావాలని సూచించింది సిబిఐ. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా కొంతమంది బురద జల్లుతున్నారని, అందుకే విచారణను వీడియో తీయమని కోరగా అంగీకరించలేదని చెప్పారు అవినాష్. న్యాయవాదిని కూడా ...
శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ప్రారింభించి 22 రోజులపాటు నిర్వహించాలని తొలుత భావించింది. మార్చి 3,4 తేదీల్లో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2.65 లక్షల కోట్ల నుంచి 2.75 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్న...
ఖమ్మంలో బీఅర్ఎస్ ఆవిర్భావ సభ పది రోజుల క్రితం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం తర్వాత ఏపీలోని విశాఖలో రెండో బహిరంగ సభ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్రలో ఉండనుంది. నాందేడ్‌లో వచ్చే నెల 5వ తేదీన బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పోలీసుల అనుమతి వచ్చింది. 5న కెసిఆర్ సమక...
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి ఇతర రాష్ట్రంలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈనెల 18న ఖమ్మం సభలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో ఇక తదుపరి మిగతా రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రం.. బీజేపీ పాలిత మహారాష్ట్ర నుంచే కేసీఆర్ పొలికేక పెట్టనున్నారు. శివసేన పార్టీ చేతిలో నుంచి అప్పనంగా బీజేపీ ...
ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు. తాము కూడా ముందస్తు ఎన్నికలకు వస్తామని ప్రకటించారు. ఎవరు ఏమిటో ప్రజల వద్ద తేల్చుకుందామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పర్యటించిన కేటీఆర్ ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తెలంగ...
ఒకనాటి దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాలు మానేసి తెలుగు రాష్ట్రాల్లో కాదు కాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయ పరిణామాలపై తరచూ స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. పవన్ కల్యాణ్ రాజకీయంపై వ్యంగ్యాస్త్రాలు తనదైన శైలిలో స్పందిస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ కు కొందరు వెన్నుపోటు పొడుస...
అనంతపురము జిల్లాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ సీపీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్ వార్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దరెడ్డిపై ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పలు విషయాలపై వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. అయితే శనివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి నియోజకవర్గంలో చే...
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ది ఐరన్ లెగ్ అని.. అందుకే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ దారుణాలు జరుగుతాయని పరోక్షంగా చెప్పారు. ఆయన తండ్రి చంద్రబాబు సైకో అయితే.. అతడి కుమారుడు లోకేశ్ ఐరన్ లెగ్.. సైకో అని తెలిపారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా లోకేశ్ గతంలో తనపై రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు వరుసగా రెండు రోజులు రద్దయ్యాయి. ముందే నిర్ణయించిన పర్యటనలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. కార్యక్రమాలను వరుసగా రద్దు చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగం కావడమేనని తెలుస్తున్నది. ఎందుకంటే ఈ కేసు విచారణ వేగం పెరిగింది. సీబీఐ రంగంలోకి దిగి తన సోదరుడు, వైఎస్సా...