నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్దతకు గురయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి వాహనం పైనుంచి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర మొదలయింది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్ ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో లోకేశ్ పక్కనే తారకరత్న ఉన్నారు . మసీదు...
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పనుల్లో బిజీగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో మైత్రి ఉండనే ఉంది. ఒడిశాపై కేసీఆర్ దృష్టిసారించారు. ఇటీవల మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, తన కుమారుడు శిశిర్ గమాంత్‌తో కలిసి కేసీఆర్‌ను కలిశారు. ఈ రోజు వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని తెలిసింది. వ...
నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఉదయం 11.03 గంటలకు లక్ష్మీపురం నుంచి ప్రారంభమైంది. యాత్ర ఆరంభంలో బ్యానర్ల చించివేత అంశం ఉద్రిక్తతకు దారితీసింది. కుప్పం చెరువు కట్ట మీద కౌన్సిలర్ సురేష్ ఏర్పాటు చేసిన బ్యానర్లను కొందరు దుండగులు చించివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. మరికొన్ని బ్యానర్లకు నిప్పు పెట్టారు. ఫ్లెక్సీలు చించివేత కుప్పంలో వివాదానికి దారి తీసింది. దీంతో లోకేష్ షెడ్యూల్‌లో స్వల్...
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందుపురం ఎమెల్యే బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని బాలయ్య జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉండబోతుందన్నారు. ఏపీ ప్రజలంతా లోకేశ్ ను ఆశీర్వదించాలని కోరారు. తాను కూడా లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. యువగళానికి అనుసంధానంగా హిందూపురంలో పలు కార్యక్రమాలను చేపడతానని పేర్కొన్నారు. ఇండియా మ్యాప్ నుంచి ...
బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయిస్తోందని ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. తనకు ఈ వాహనం వద్దు అని చాలా సార్లు లేఖ రాశానని వివరించారు. అయినప్పటికీ అధికారులు వినడం లేదన్నారు. వాహనం వాడకుంటే తనకు నోటీసులు పంపిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటీవల శంషాబాద్ నుంచి వస్తోండగా పురాణాపూర్ సర్కిల్ వద్ద కూడా వెహికిల్ ఆగిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలు అంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదని చెప్పారు. రాజాసింగ్ చస్త...
టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ రోజు ఉదయం కానుంది. టీడీపీ శ్రేణులు యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేశాయి. నిన్ననే లోకేశ్ కుప్పం గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ఉదయం 10.15 గంటల సమయంలో వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం బహిరంగ సభలో పాల్గొంటారు. సభకు 50 వేల మందికి పైగా టీడీపీ నేతలు వస్తారని చెబుతున్నారు. సభలో వేదిక...
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ రోజు(27 జనవరి) నుండి ప్రారంభం కానుంది. ఉదయం గం.11.03 నిమిషాలకు నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. 4000 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర 400 రోజులు సాగనుంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం లోకేష్ కుప్పం వచ్చారు. ఆడపడుచులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బడ చేశారు. ఉదయం స్థానిక […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన రాయలసీమ పరిరక్షణ వేదిక చీఫ్ బైరెడ్డి రాజశఖరరెడ్డి మండిపడ్డారు. తనను జనసేనాని ముసలోడు అంటున్నారని, ఎలా అయితే కొండారెడ్డి బురుజు వద్ద తనతో కుస్తీకి సిద్ధమా అని సవాల్ చేశారు. సీమ ఉద్యమకారుల్ని పవన్ అవమానించారన్నారు. సీమ సెంటిమెంట్ ఆయనకు ఏం తెలుసన్నారు. సీమను రెండుగా చేయాలని చూస్తే, ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విభజన సమయంలో పవన్ సినిమాలు తీసుకుంటూ నోరు ఎత్తలేదని, ఇప...
సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మం మీద దాడి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మధ్య హిందూ దేవతల పైన మాట్లాడటం చూస్తూనే ఉన్నామని, ఇది అత్యంత దారుణమని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అయ్యప్ప స్వామిని, ఆ తర్వాత సరస్వతి మాతను దూషించిన అంశాలు చూశామని గుర్తు చేశారు. అలా దూషించే అందరికీ నేను చేతులు జోడించు చెబుతున్నానని, అలాంటి దూషణ కేవలం బ్రాహ్మణులే బాధపడతారు అనుకుంటే పొరపాటు అన్నారు. ప్...
గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ( India: The Modi Question) దేశంలో వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్ లో నిషేధించిన డాక్యుమెంటరీని గణతంత్ర దినోత్సవం రోజు పలుచోట్ల వీక్షించారు. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించిన ఆయా చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణలోని హెచ్ సీయూలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేయడంతో వర్సిటీలో అలజడి మొదలైంది. రెండు విద్యార్థి సంఘాల మధ...
మరికొన్ని గంటల్లో టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర కుప్పం నుంచి జరగనుంది. గురువారం రాత్రి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు లోకేశ్ చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. మహిళలు హారతి ఇచ్చి దిష్టి తీశారు. గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ సీనియర్ నేతలు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం పాదయాత్ర తొలిరోజు.. కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభకు 50 వ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. గణతంత్ర దినోత్సవం రోజున పద్ధతిగా మాట్లాడతారు.. పవన్ అలా కాదన్నారు. సెలబ్రిటీ పార్టీ నేత మాత్రం సన్నాసి మాటలు మాట్లాడాడని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పిచ్చెక్కినట్టు మాట్లాడటంతో రియాక్ట్ కావాల్సి వస్తోందని తెలిపారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఓ సామెతను చెప్పా...
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి పద్మశ్రీ అవార్డు వరించింది. ఎంఎం కీరవాణి, ఆ పాట రాసిన గీత రచయిత చంద్రబోస్‌ను గవర్నర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో...
సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడ ప్రీమియం లిక్కర్, లేదంటే చీఫ్ లిక్కర్ దొరుకుతుంది. దీంతో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. పోలీసులకు సందేహాం కలిగి, పలు సందర్భాల్లో చెక్ చేస్తుంటారు. ఈ రోజు కడప జిల్లా ఖాజీపేట వద్ద తనిఖీ చేపట్టారు. కర్ణాటకకు చెందిన మద్యం భారీగా పట్టుబడింది. వైసీపీ నాయకుడి కారులో మద్యం దొరకడం విశేషం. బి.మఠం...
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగాల్సిన గణతంత్ర వేడుకలు రాజకీయ వివాదానికి కారణమైంది. పార్టీలకతీతంగా సజావుగా జరుగాల్సిన గణతంత్ర వేడుకలను పార్టీలు రాజకీయం చేశాయి. తెలంగాణలో అది తీవ్రం కాగా.. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదేస్థాయిలో జరిగింది. రాజ్ భవన్ వేదికగా సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతుంటారు. ఈ మే...