జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన రాయలసీమ పరిరక్షణ వేదిక చీఫ్ బైరెడ్డి రాజశఖరరెడ్డి మండిపడ్డారు. తనను జనసేనాని ముసలోడు అంటున్నారని, ఎలా అయితే కొండారెడ్డి బురుజు వద్ద తనతో కుస్తీకి సిద్ధమా అని సవాల్ చేశారు. సీమ ఉద్యమకారుల్ని పవన్ అవమానించారన్నారు. సీమ సెంటిమెంట్ ఆయనకు ఏం తెలుసన్నారు. సీమను రెండుగా చేయాలని చూస్తే, ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విభజన సమయంలో పవన్ సినిమాలు తీసుకుంటూ నోరు ఎత్తలేదని, ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా వినిపిస్తోన్న విభజన వాదంపై జనసేనని హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల బైరెడ్డి మాట్లాడితూ… రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ… ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వేర్పాటువాద రాజకీయాలు చేస్తే తనలాంటి తీవ్రవాదిని మరోసారి చూడబోరన్నారు. పబ్లిక్ పాలసీని తెలియని మీరు రాష్ట్రాలు విడదీస్తానంటే తోలుతీసి కూర్బోబెడతా అన్నారు. కొంతమంది తమషా చేస్తున్నారని మండిపడ్డారు. సన్నాసులతో చాలా విసిగి పోయమన్నారు. సీమను మా నేలా అంటున్నారని, ఇది మా దేశం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ గురించి మాట్లాడుతున్నారని, అక్కడి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, కర్నూలు నుండి రాజధాని వెళ్లిపోతుంటే ఎందుకు కాపాడుకోలేకపోయారన్నారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కోరుతున్న వారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఇతర ప్రాంతాలవారు చనిపోయిన విషయం తెలుసా అని ప్రశ్నించారు. పవన్ ఆగ్రహం నేపథ్యంలో బైరెడ్డి స్పందించారు.