PLD: మాచర్లలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మురికి కాలువలు, రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ బాక్సులు లేకపోవడంతో చెత్త రోడ్లపై వేస్తున్నారు. అధికారులు తక్షణమే సమస్యలు పరిష్కరించి, ప్రజలను సీజనల్ వ్యాధుల నుంచి కాపాడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.