MDK: తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులో శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం చేపట్టారు. తూప్రాన్ విద్యుత్ డీఈ గరత్మంత్ రాజ్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు ప్రజా బాట కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూరా పిచ్చి మొక్కలను తొలగించి మరమ్మత్తులు చేశారు. మెరుగైన విద్యుత్తుకు ప్రజాబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు.