TG: HYDలో ట్రాఫిక్ కూడళ్ల వద్ద హారన్ మోగింపుతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది. దీంతో ముంబై, బెంగళూరులో విజయవంతమైన ‘హంక్ మోర్.. వెయిట్ మోర్’ అనే విధానాన్ని HYDలోనూ అమలు చేస్తే శబ్దం కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అంటే సిగ్నళ్ల వద్ద హారన్ కొడితే శబ్దతీవ్రతను బట్టి.. రెడ్ సిగ్నల్ సమయం దానంతట అదే పెరుగుతుంది. దీంతో వెయిటింగ్ టైం కూడా పెరుగుతుంది.