కోనసీమ: మండపేట మండలం కేశవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి శనివారం నిర్వహించారు. దళిత నాయకుడు ఎడ్ల రవి, జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని కోరారు. ఆయన లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.