SDPT: మద్దూరు మండలం గాగిళ్లపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.