MDK: నిజాంపేట మండలంలో సర్పంచ్, వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థులు మైకు ద్వారా ప్రచారం చేయాలనుకుంటే తప్పకుండా అనుమతి తీసుకోవాలని ఎస్సై రాజేష్ తెలిపారు. అభ్యర్థులు మీ సేవలో చలాన్ కట్టి, తూప్రాన్ డీఎస్పీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే స్థానిక ఎస్సై/సీఐ సంతకాలు తీసుకుని, డీఎస్పీ నుంచి ఎన్ఓసీ పొంది, తహసీల్దార్ ద్వారా అనుమతి పొందాలన్నారు.