MDK: జిల్లాలో మూడో విడత ఎన్నికల జరగనున్న గ్రామపంచాయతీలలో 4,556 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడు, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాలలోని 183 గ్రామపంచాయతీలు, 521 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, సర్పంచ్ పదవులకు 1028, వార్డుపదులకు 3,528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.