E.G: గోకవరం మండల కేంద్రంలో గల సంజీవయ్య నగర్ ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. ఈ వీధి కుక్కల కారణంగా అటుగా వెళ్లే వాహనదారులు, పాద చారులు, స్కూలుకు వెళ్లే విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున వీధి కుక్కల నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.