క్రీస్తుపూర్వం 1850 నాటి కాలంలో గర్భం రాకుండా ఉండేందుకు ఈజిప్ట్ ప్రజలు మొసలి పేడను వాడేవారట. వీర్యం గర్భాశయంలోకి వెళ్లకుండా అడ్డుగోడలా దీనిని ఉపయోగించేవారట. మొసలి పేడను, తేనెను కలిపి యోనిలోకి పంపి అడ్డుగోడలా పెట్టేవారట. ఆ తర్వాత శృంగారంలో పాల్గొనేవారట. కాగా, ఇప్పుడు వాడుకలో ఉన్న గర్భనిరోధక డయాఫ్రాగ్మ్ పరికరం ఇదే సూత్రం మీద పనిచేస్తుంది.