AKP: ప్రతి పౌరుడు రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని అనకాపల్లి DSP శ్రావణి విజ్ఞప్తి చేశారు. శనివారం అనకాపల్లిలో రహదారి భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.