KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి బండి సంజయ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నాయకులంతా ప్రత్యేక పూజలు చేశారు.