ఈ ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరాల జాబితాను జులియస్ బేర్ గ్లోబల్ వెల్త్ & లైఫ్ స్టైల్ విడుదల చేసింది. ఈ ఏడాది కూడా సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. లండన్ రెండో ప్లేస్‌లోకి వచ్చింది, హాంకాంగ్ మూడు, మొనాకో నాలుగు, జ్యూరిచ్(స్విట్జర్లాండ్) ఐదు, షాంఘై(చైనా) ఆరు, దుబాయ్ ఏడో స్థానంలో ఉంది. మన దేశం నుంచి ముంబై 20వ స్థానంలో నిలిచింది.