KDP: ఐసీడీఎస్ పీడీ రమాదేవి అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. శుక్రవారం పులివెందుల ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారాన్ని బాలింతలు, గర్భిణులకు తప్పనిసరిగా అందించాలని ఆమె ఆదేశించారు.