ATP: కోనాపురం గ్రామ పంచాయతీకి కొత్త సచివాలయం ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో మంజూరైంది. ఈ సచివాలయం కోసం ఇంటూరి శ్రీనివాసులు రెడ్డి ఉచితంగా స్థలాన్ని అందించారు. పంచాయతీరాజ్ అధికారులు స్థలంలో మార్కింగ్ ఇచ్చారు. సచివాలయం మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే సునీత, పరిటాల శ్రీరామ్కి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.