KMM: మధిర పట్టణంలోని శ్రీ స్వామి అయ్యప్ప దేవస్థానంలో శివేలి ఉదయాస్తమాన పూజ మహోత్సవాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామునుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా వేద మంత్రోచ్చారణల మధ్య హోమ కార్యక్రమంతో మహోత్సవాలను ప్రారంభించారు. ఆలయంలో శబరిమల సాంప్రదాయ గానాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్తేజ పరిచాయి.