SKLM: మందస మండలానికి సంబంధించిన దేవాదాయ ధర్మదాయ శాఖ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మందస పట్టణంలోని దేవాదాయ స్థలాలలో ప్రైవేట్ వ్యక్తులు భారీ భవన నిర్మాణాలు,షెడ్లు నిర్మిస్తున్న సంబంధిత అధికారులు అటువైపు తొంగి చూడడం లేదు. కొన్నిచోట్ల లక్షలాది రూపాయలకు అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పై క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.