ELR: జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. వారి నుంచి రూ.25,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.