janasena pawan kalyan about alliance in kondagattu
సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మం మీద దాడి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మధ్య హిందూ దేవతల పైన మాట్లాడటం చూస్తూనే ఉన్నామని, ఇది అత్యంత దారుణమని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అయ్యప్ప స్వామిని, ఆ తర్వాత సరస్వతి మాతను దూషించిన అంశాలు చూశామని గుర్తు చేశారు. అలా దూషించే అందరికీ నేను చేతులు జోడించు చెబుతున్నానని, అలాంటి దూషణ కేవలం బ్రాహ్మణులే బాధపడతారు అనుకుంటే పొరపాటు అన్నారు. ప్రతి హిందువు ఆ వ్యాఖ్యలకు బాధపడతారని చెప్పారు. దయచేసి హిందూ దేవతలను దూషించడం మానుకోవాలన్నారు. ఇది తన విన్నపం అని చెప్పారు. ఇలాంటి వారికి మొహమ్మద్ ప్రవక్తను అనడానికి, జీసస్ క్రీస్తును అనడానికి భయం వేస్తదని, కానీ హిందూ దేవతలను అనడానికి మీకు ధైర్యం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇలా ఒక మతాన్ని , దేవతల్ని దూషించడం తప్పు అన్నారు. ఇలా మాట్లాడినందుకు నేను రైట్ వింగ్ అనుకోవద్దు అని, సగటు భారతీయుడను అన్నారు. ఒకవేళ రైట్ వింగ్ అనుకున్నా ఇబ్బంది లేదు అన్నారు.
చర్చిలపై దాడి జరిగితే మొదట గొంతు విప్పేది తానే అని, అలాగే మొహమ్మద్ ప్రవక్తకు అవమానం జరిగితే మొదట వచ్చే గొంతు తమదే అన్నారు. అలాగే అయ్యప్ప స్వామీ పైన మాట్లాడిన మా గొంతు నిలదీస్తుందని చెప్పారు. సెక్యులరిజం సెక్యులరిజం అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దు అని హితవు పలికారు. హిందూధర్మం పైన అవకాశవాద హిందువులు దాడి చేసినంత ఎక్కువగా మరెవరూ చేయరు అని చెప్పారు. మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల ఎవరైనా ఇలా దూషిస్తే సాటి హిందువులుగా మీరు నిలదీయాలని, ఎదుర్కోవాలని సూచించారు. అలా ఎదుర్కోవడం మన అందరి బాధ్యత అన్నారు.