• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

తిరుపతిలో జెండా పండగ.. ఆకట్టుకున్న పోలీసుల కవాతు

  తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కలెక్టర్ శుభాకాంక్షలను తెలిపారు. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో త్యాగధనుల కృషి అని వివరించారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా...

January 26, 2023 / 07:21 PM IST

తెలంగాణ సర్కార్ రాజ్యాంగాన్ని అవమానించింది: గవర్నర్

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్ అవమానించిందని పేర్కొన్నారు. తమిళి సై సౌందరరాజన్ పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాజ్ భవన్‌లో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదని విశ్వసనీయ సమాచారం. ‘ప్రజల మధ్య గణతంత్ర వ...

January 26, 2023 / 06:21 PM IST

శ్రావణి వెనక బీజేపీ.. ఫేస్‌బుక్ లైవ్ ఎందుకు ఇచ్చింది: సంజయ్

‘సంజయ్ దొర మీకు దండాలు, మున్సిపల్ చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తున్నా’ అని నిన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి మీడియా ముందుకు వచ్చారు. శ్రావణి ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి వెనక బీజేపీ నేతలు ఉన్నారని తిప్పికొట్టారు. ఈ విషయం కౌన్సిలర్లే తనకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఆమె రాజీనామా చేయగా బీజేపీ ఫేస్‌బుక్ లైవ్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆమెను తాను వే...

January 26, 2023 / 06:08 PM IST

పొత్తులపై పవన్ నాలుగో ఆప్షన్ ఇస్తే బాగుండేది: సజ్జల

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పొత్తుల గురించి ఆయన చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తోందన్నారు. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చేయడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సిందని ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చ...

January 26, 2023 / 05:50 PM IST

‘ఎట్ హోం’కు కేసీఆర్ డుమ్మా? హస్తినకు గవర్నర్ తమిళి సై

ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. రిపబ్లిక్ డే రోజున సాయంత్రం గవర్నర్ ఎట్ హోం నిర్వహిస్తుంటారు. ఇటీవల సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య దూరం మరింత పెరిగింది. అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. కోర్టు తీర్పు తర్వాత రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహణకు ఏర...

January 26, 2023 / 03:59 PM IST

కేసీఆర్ మీ పనైపోయింది.. రిటైర్మెంట్ తీస్కో: విజయశాంతి

గణతంత్ర దినోత్సవ కార్యక్రమం కూడా తెలంగాణలో రాజకీయంగా మారింది. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షంపై తీవ్రంగా స్పందించగా.. గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితం చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఇదే విషయమై సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. కేసీఆర్ వెంటనే వీఆర్ఎస్ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధ...

January 26, 2023 / 03:51 PM IST

థ్యాంక్యూ గవర్నర్.. మా మాటే మీ నోట: కల్వకుంట్ల కవిత

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా సాగుతుండగా తెలంగాణలో మాత్రం వాడీవేడిగా జరిగాయి. మరోసారి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గణతంత్ర వేడుకలు వివాదానికి కారణమయ్యాయి. రాజ్ భవన్ లో జెండా వందనం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఫామ్ హౌజ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజ్...

January 26, 2023 / 04:34 PM IST

గవర్నర్ కు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: రేవంత్

గణతంత్ర వేడుకల వేదికను రాజకీయం చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ తమిలసాయి, ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రాద్ధాంతం సరికాదని, ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్...

January 26, 2023 / 02:11 PM IST

తెలుగు వారికి పద్మ అవార్డులు, కేంద్రంపై బాబు ప్రశంస

తెలుగువారికి పద్మ అవార్డుల పైన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మ అవార్డులు సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డులు సాధించిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎందరో తెలుగువారి అద్భుతమైన కృషిని గుర్తించడం తనకు చాలా సంతోషాన్ని కల...

January 26, 2023 / 11:14 AM IST

రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైద...

January 26, 2023 / 02:05 PM IST

రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ డే పరేడ్.. ఉ.6.50 గంటలకు ప్రారంభం

రిపబ్లిక్ డే వేడుకలు, పరేడ్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ప్రభుత్వం పరేడ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. గురువారం రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహిస్తామని తెలియజేసింది. ఉదయం 6.50 గంటలకు రాజ్ భవన్‌లో పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏడు గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకకు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. తెలంగాణ రాష్ట్రంలో రిపబ్ల...

January 26, 2023 / 05:35 PM IST

మంచినీరు ఇచ్చేందుకు బ్రిటిష్ మహిళ నిరాకరించారు: పవన్

ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరు వివక్షకు గురవుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పుడే దాని గురించి తెలుస్తుందని వివరించారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు నీళ్లు ఇవ్వడానికి ఓ బ్రిటీష్ మహిళ నిరాకరించారని గుర్తుచేశారు. వ్యక్తి ఆరాధన ప్రమాదకరం అని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజాన్ని సమగ్రంగా చూడాలని చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బ...

January 25, 2023 / 08:36 PM IST

రిపబ్లిక్ డే జరపాల్సిందే.. పరేడ్ కంపల్సరీ: తెలంగాణ హైకోర్టు

రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. యావత్ దేశం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటుందని గుర్తుచేసింది. పరేడ్ తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది. ఈ వేడుకకు ప్రజలను అనుమతించాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున రాజ్ భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖ రాశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. అక్కడ జరిగే వేడుకలకు ప్రభుత్వ ప్రతిన...

January 25, 2023 / 05:38 PM IST

పాదయాత్రకు సిద్ధమై లోకేష్.. 4వేలకు పైగా 400 రోజులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న లోకేష్ నాయుడు భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్దగా యాత్రకు బయల్దేరారు. కాగా.. 400 రోజుల పర్యటనలో లోకేష్ ప్రజలతో మమేకం...

January 25, 2023 / 05:35 PM IST

ప్రజలకు నారా లోకేష్ బహిరంగ లేఖ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 27వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేసారు. అంతకుముందు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు. మామయ్య బాలకృష్ణ దగ్గరుండి కారెక్కించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. పాదయాత్రకు ఇంటినుండి బయలుదేరిన అనంతరం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. విభ‌జ‌న నేపథ్యంలో లోట...

January 25, 2023 / 05:22 PM IST