వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల పాదయాత్ర మళ్లీ స్టార్ట్ అవుతోంది. వరంగల్ ఘటనతో తెలంగాణలో ఆమె చేపడుతున్న పాదయాత్ర ఆగిపోయింది. షర్మిల కాన్వాయ్ పై దాడి చేయడం, ఆ కారుతోనే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లడం, అక్కడ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం, స్టేషన్ కు తీసుకెళ్లడం, వంటివి చకచకగా జరిగిపోయాయి. ఈ క్రమంలో పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే తాజాగా.. ఈనెల 28 నుంచి పాదయాత్ర మళ్లీ ప్...
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ వేడుకకు జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఉ.11:30కి సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ఫిక్స్ చేశారు. ఆ రోజు మొదట వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు. ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ సీఎం సొరేన్ హాజరుకానున్నరు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ముందుగానే నిర్ణయించిన జనవరి 27న ఫిక్స్ చేసిన ముహూర్తానికే కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది. పోలీసుల నుంచి అనుమతి కోసం టీడీపీ నేతలు ఎన్నో విధాలుగా యత్నించారు. కానీ పోలీసుల నుంచి ఎటు...
ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా హిందూ మత గ్రంథాలను ప్రవేశపెడతాం అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీత, శ్రీరామ చరితం,రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, వేదాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడతాం అంటూ వ్యాఖ్యానించారు. ఇవి చదివితే మనిషిలో నైతికత పెరుగుతుందని నేటి బాలలే రేపటి పౌరులని భారత దేశ పౌరులకు నైతికత పెంపొందాలంటే హిందూ గ్రంధాలను చదవాలని అన్నారు. హిందూ...
తాను గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని అనుకుంటున్నట్లు స్వయంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ప్రకటించారు. సోమవారం రాజ్ భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆయన తెలిపారు. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. భార...
తమ పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయన పాదయాత్రతో వైసీపీ కుక్కలకు జ్వరం పట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్ర చేసే హక్కు ఉందన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి మృతిని కూడా జగన్ రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. .మంత్రి రోజాకు రాజకీ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి ఈరోజు అంజన్న సన్నిథితిలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం ఈ వాహనం రోడ్డు ఎక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనం అయ్యారు. ఉదయం 11 గంటలకు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం జ...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం లోకేష్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకుంటారు. 27న కుప్పం నుండి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, ప్రారంభిస్తారు. 25వ తేదీ మధ్యాహ్నం గం.1.20కి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి మొదట ఎన్టీఆర్ ఘా...
ఎక్కడికక్కడ బీజేపీని దెబ్బ తీసేందుకు ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీజేపీపై శివసేన పార్టీ ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్ర ఆగ్రహంగా ఉంది. బీజేపీని ఎలాగైనా దెబ్బ తీయాలని ఉన్న మార్గాలన్నింటిని వినియోగించుకుంటోంది. ఈ సందర్భంగా సరికొత్త రాజకీయాలకు తెర లేపింది. దేశంలోనే అతి పెద్ద మహానగర పాలక సంస్థగా గుర్తింపు పొందిన ముంబై కార్పొరేషన్ ఎన్...
వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జగన్ ఇవ్వలేను అంటే తానైనా ఏమీ చేసేదీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు వాపోయారు. ఏది ఏమైనా విబేధాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొన్నాళ్ల నుంచి బాలినేని పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి వైదొ...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి శాంతాకుమారిని కాంగ్రెస్ నాయకులు కలిశారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , వీహెచ్, శ్రీధర్ బాబు, మల్లురవి, సీఎస్‌ను కోరారు. అంబేద్కర్ విగ్రహం కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావడం బాధకరమని కాంగ్రెస్ నేతలు వాపోయారు. అంబేద్కర్ ను అవమానిస్తే చూస్తే ఊరుకోమని వారు హెచ్చారించారు
– ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని షాహీద్ మినార్ మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్‌ఎస్‌ఎల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. నేతాజీ తన జీవితాన్నంతా దేశం కోసం అంకితం చేశారని కొ...
మరో నాలుగురోజుల్లో నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలీసుల అనుమతి రాకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహించొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జీవో నంబర్ 1 అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ వైఖరిని విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రతిపక్షాల గొంతు అ...
సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని 52 ఏళ్ల రాహుల్ గాంధీ అన్నారు. కర్లీ టెయిల్స్ డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకొవాలని అనుకుంటున్నారా ?’ అని యాంకర్ అడిగ్గా…సరైన అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటానని చెప్పారు. చెక్ లిస్టు ఏమైనా ఉందా?’ అని యాంకర్ ప్రశ్నించగా… ‘అదేమీ లేదు… ప్రేమించే వ్యక్తి, ఇంటెలిజెంట...
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.