సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని 52 ఏళ్ల రాహుల్ గాంధీ అన్నారు. కర్లీ టెయిల్స్ డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకొవాలని అనుకుంటున్నారా ?’ అని యాంకర్ అడిగ్గా…సరైన అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటానని చెప్పారు. చెక్ లిస్టు ఏమైనా ఉందా?’ అని యాంకర్ ప్రశ్నించగా… ‘అదేమీ లేదు… ప్రేమించే వ్యక్తి, ఇంటెలిజెంట్ అయితే చాలు’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘మీ మెసేజ్ అమ్మాయిలకు చేరుతుందిలేండి’ అని యాంకర్ అనడంతో.. ‘మీరు నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నారు’ అంటూ రాహుల్ నవ్వేశారు.ఈ మధ్య రాహుల్ ఎక్కడికెళ్లినా పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించిన ప్రస్తావన రావడంతో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. తన తల్లి సోనియా గాంధీ, తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి లక్షణాలు తనకు కాబోయే భాగస్వామిలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరి ‘పెళ్లి ఎప్పుడు?’ అనే ప్రశ్నకు రాహుల్ జవాబు ఎప్పుడు చెబుతారో??