»Election Manifesto The Hand That Released The Election Manifesto
Election Manifesto: ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన హస్తం!
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయ్పత్ర-2024 పేరుతో 48 పేజీలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 5 న్యాయ పథకాలు, 25 గ్యారంటీలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు.
Election Manifesto: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయ్పత్ర-2024 పేరుతో 48 పేజీలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 5 న్యాయ పథకాలు, 25 గ్యారంటీలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కీలక హామీలు
యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన
రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్
మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం
విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు
విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం
అగ్నివీర్ స్కీమ్ రద్దు
రైతులకు కనీస మద్దతు ధరపై హామీ
బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ
సామాజిక ఆర్థిక సమానత్వం కోసం చర్యలు
వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత
రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ
దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల పంపిణీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
దేశవ్యాప్తంగా కులగణన
కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ
50 శాతం రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వంటి హామీలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.