సమ్మర్లో సాలిడ్ ఎంటర్టైనర్గా వచ్చింది డీజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ సినిమా. ఆరు రోజుల్లోనే 90 కోట్లు కొల్లగొట్టిన టిల్లుగాడు.. అక్కడే ఆగిపోయాడు. వంద కోట్లు రాబట్టడానికి కాస్త టైం తీసునేలా ఉన్నాడు. ఇంతకీ టిల్లుకి ఏడు రోజుల్లో ఎంత వచ్చింది?
Tillu Square: మార్చి 29న సోలోగా థియేటర్లోకి వచ్చాడు టిల్లు గాడు. అందుకు తగ్గట్టే.. సినిమాకు సాలిడ్ హిట్ టాక్ పడింది. ఇంకేముంది.. బాక్సాఫీస్ దగ్గర ఊహించని కలెక్షన్స్ అందుకున్నాడు టిల్లుగాడు. టిల్లు స్క్వేర్ రిలీజైన మొదటి రోజు మధ్యాహ్నమే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. పాతిక కోట్ల ఓపెనింగ్, లాంగ్ రన్లో వంద కోట్లు కొడుతున్నామని చెప్పాడు. ఆ తర్వాత అదే నిజమైంది. ఫస్ట్ డే 23 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన టిల్లు స్క్వేర్.. ఆరు రోజుల్లో 91 కోట్లు రాబట్టాడు. దీంతో మొదటి వారంలోనే వంద కోట్ల పోస్టర్ బయటికొస్తుందని అనుకున్నారు.
కానీ ఏడో రోజు 3 కోట్లు మాత్రమే రాబట్టి.. మొత్తంగా 94 కోట్లు వసూలు చేసినట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి కారణం ఫ్యామిలీ స్టార్ అనే చెప్పాలి. ఇప్పటికే థియేటర్లో టిల్లుగాడు సూపర్ హిట్ టాక్‌తో ఉన్నప్పటికీ.. విజయ్ దేవరకొండ సినిమా రావడంతో.. కలెక్షన్స్ కాస్త తగ్గాయి. లేదంటే.. ఈ పాటికే హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లో జాయిన్ అయి ఉండేవాడు టిల్లు. ఫ్యామిలీ స్టార్ వల్ల థియేటర్ కౌంట్ తగ్గింది కాబట్టి.. సెకండ్ వీకెండ్ వరకు టిల్లు వంద కోట్లు కొట్టడం గ్యారెంటీ. అయితే.. ఫ్యామిలీ స్టార్ డే వన్ కలెక్షన్స్ ఎంత అనే దానపైనే అందరి దృష్టి ఉంది.
కానీ ఈ సినిమాకు డివైడ్ టాక్ టాక్ వస్తోంది. దీంతో.. వసూళ్ల పరంగా ఫ్యామిలీ స్టార్ టిల్లుగాడిని కొట్టడం కష్టమనే టాక్ వస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమా డీజె టిల్లు సీక్వెల్‌గా అదిరిపోయే హైప్‌తో థియేటర్లోకి రాగా.. ఫ్యామిలీ స్టార్ కూడా విజయ్ దేవరకొండ, దిల్ రాజు చేసిన ప్రమోషన్స్‌తో అంచనాలను పెంచేస్తూ రిలీజ్ అయింది. కానీ టిల్లు స్క్వేర్‌కు వచ్చినంత టాక్ ఫ్యామిలీ స్టార్‌కు రాలేదు. దీంతో.. వచ్చే వారం కూడా టిల్లుగాడికి పండగేనని చెప్పాలి.