»Vijay Devarakonda The Huge Cutout Is Ok And What About The Movie
Vijay Devarakonda: భారీ కటౌట్ సరే.. మరి సినిమా పరిస్థితేంటి?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు సినిమా నుంచి లేటెస్ట్ ఫ్యామిలీ స్టార్ వరకు రౌడీ క్రేజ్ పెరుగుతునే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండకు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. మరి ఫ్యామిలీ స్టార్ పరిస్థితేంటి?
Vijay Devarakonda: ఖుషి సినిమాతో ఆడియెన్స్‌ను అంతంత మాత్రమే ఖుషీ చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఈ సారి ఫ్యామిలీ స్టార్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేశారు. దీంతో మంచి అంచనాలతో ఏప్రిల్ 5న థియేటర్లోకి వచ్చింది ఫ్యామిలీ స్టార్. ఇక మొదటి ఆట నుంచి ఈ సినిమాకు డివైడ్ టాక్ పడింది.
ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్, సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్ బాగుందనే రివ్యూస్ వస్తున్నా.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పెయిర్ బాగుందని అంటున్నా.. మిక్స్డ్ రివ్యూస్ ఎక్కువగా ఇస్తున్నారు. బొమ్మ యావరేజ్ అంటున్నారు. ఓవరాల్‌గా మెజారిటీ పీపుల్ మాత్రం ఫ్యామిలీ స్టార్‌కు అంతంత మాత్రంగానే ఉందని రివ్యూస్ ఇచ్చారు. దీంతో.. రౌడీ ఈ సినిమాతో హిట్ కొట్టినట్టేనా? అంటే, ఇప్పుడే చెప్పలేము. ఈ విషయం తేలాలంటే ఫస్ట్ డే ఓపెనింగ్స్, ఈ వీకెండ్ కలెక్షన్స్‌ను బట్టి ఉంటుంది.
ఇక యూత్‌లో రౌడీ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో రౌడీ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆన్లైన్లో మాత్రమే కాదు.. ఆఫ్ లైన్లో కూడా రౌడీకి సూపర్ క్రేజ్ ఉంది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దాదాపు 80 అడుగుల ఎత్తుతో ఈ కటౌట్ ఉంది. ఏదేమైనా.. రౌడీకి సాలిడ్ హిట్ పడి చాలా కాలమే అవుతోంది.. కానీ క్రేజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతునే ఉంది.