»Rashmika Mandanna Rashmikas First Look Release From Pushpa2 Srivalli Adrindi
Rashmika Mandanna: పుష్ప2 నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్.. శ్రీవల్లి అదిరింది!
ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. ఏప్రిల్ 5న గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రష్మిక నటిస్తున్న సినిమాల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
Rashmika Mandanna: పుష్ప పార్ట్ 1 సినిమా ఎంత సెన్సేషన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూలోడుగా మొదలైన పుష్పరాజ్ ప్రయాణం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి సిండికేట్ లీడర్‌గా ఎదిగాడు. ఇప్పుడు సీక్వెల్లో పుష్పగాడి రూలింగ్ చూడబోతున్నాం. అంతేకాదు.. సెకండ్ పార్ట్‌లో పుష్పగాడు చాలా రిచ్ కూడా. అందుకే.. పుష్పగాడి భార్య శ్రీవల్లిని ఫస్ట్ లుక్‌తోనే చాలా రిచ్‌గా చూపించాడు సుకుమార్. ఇప్పటికే లీక్ అయిన ఫోటోల్లో రష్మిక లుక్ సూపర్ అనేలా ఉంది. ఇక ఇప్పుడు అఫీషియల్‌గా రిలీజ్ చేసిన శ్రీవల్లి ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే సందర్భంగా.. బర్త్ డే విష్ చేస్తూ పుష్ప2లో రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రష్మిక గ్రీన్ శారీలో, భారీ నగలతో చాలా గ్రాండ్‌గా కనిపిస్తోంది. దీంతో ఈసారి కూడా శ్రీవల్లి క్యారెక్టర్ సినిమాలో అదరగొట్టడం గ్యారెంటీ. ఇక రష్మికకు బర్త్ డే విష్ చేస్తూ ఇంకొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. అందులో గీతా ఆర్ట్స్ బ్యానర్లో రష్మిక చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నుంచి రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తోంది రష్మిక మందన్న.
చేతికి ఓల్డ్ మోడల్ వాచ్ ధరించి కాలేజీ అమ్మాయిగా కనిపిస్తోంది. ఆమె పెదాల కంటే ముందు కళ్లు చిరునవ్వులను చిందిస్తాయి. ఆమె మాట్లాడటానికి కంటే ముందే ఆ కళ్లు ఎన్నో అందమైన భావాలను పలకిస్తాయి.. అంటూ ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన శ్రీవల్లితో పాటు గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక బర్త్ డే విష్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు ఆమె అభిమానులు.