కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ ఓ సభలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు.
Pm Modi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ ఓ సభలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లారని మోదీ ఆరోపించారు. భయపడవద్దు.. పారిపోవద్దని కూడా మోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ పదేపదే విమర్శించారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలతో దాడి చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
ఎవరూ భయపడవద్దు అంటూ పేర్కొన్నారు. రాహుల్ చేసిన ఆ వ్యాఖ్యలను ఇప్పుడే ఆయనకే ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ విమర్శలు చేశారు. సోనియా గాంధీని కూడా విమర్శించారు. తల్లీకొడుకులు ఇద్దరు తమ స్థానాన్ని వదిలివేసి పారిపోయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వయనాడ్‌లో రాహుల్ ఓటమి ఖరారు అవుతుందని, ఓటింగ్ ముగిసిన తర్వాత రాహుల్ మూడవ సీటు గురించి ప్రయత్నం మొదలుపెడతారన్నారు. అమేథీలో ఓటమి భయం వల్ల, రాయ్‌బరేలీకి వెళ్లారని భయపడవద్దని, ఎవరూ పారిపోవద్దని కాంగ్రెస్ నేతకు మోదీ కౌంటర్ ఇచ్చారు.