»Congress Congress Releases Special Manifesto For Telangana
Congress: తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేశారు. ఈ మేనిఫెస్టోలో 23 కీలక అంశాలను ప్రాధాన్యత ఇచ్చారు. మరి అవేంటో తెలుసుకుందాం.
Congress: Congress releases special manifesto for Telangana
Congress: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్తోను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ గాంధీ భవన్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా 23 కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
మేనిఫెస్టోలోని కీలక అంశాలు
*కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
*బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం
*రాష్ట్రంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు
*రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైను ఏర్పాటు
*రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు
*యువత కోసం వివిధ రకాల యూనివర్సిటీల ఏర్పాటు
*అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు
*మేడారం జాతరకు జాతీయ హోదా
*గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రారంభిస్తాం
*భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతాం
*నాలుగు సైనిక పాఠశాలలు ఏర్పాటు
*కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు
*కేంద్ర నిధులు నేరుగా స్థానిక సంస్థలకు అందేలా చర్యలు
*సౌరశక్తి ఉత్పత్తిని ప్రోత్సహిస్తాం
*సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు
*ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం
*పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా
*నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు పెంచుతాం